రెట్రో స్పెషల్ డ్యాన్స్ తో బిబి జోడి ప్రోమో!
on Feb 28, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో బిబి జోడి. ఈ షో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో మొదలయిన విషయం తెలిసిందే. ఈ షోలో శ్రీముఖి యాంకర్ గా.. సదా, తరుణ్ మాస్టర్, రాధ జడ్జ్ లుగా చేస్తున్నారు.
ప్రతీవారం కొత్త కాన్సెప్ట్ లతో ఆకట్టుకుంటున్న బిబి జోడి.. తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్స్ ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేసినట్టుగా వాళ్ళ పర్ఫామెన్స్ కనిపిస్తోంది. కాగా ఇప్పుడు ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వారం ఎపిసోడ్ లో రెట్రో స్పెషల్ ఉంటుదని తెలుస్తుంది. రెట్రో స్పెషల్ అంటే జోడీలు పాత పాటలని రిక్రీయేట్ చేసి డ్యాన్స్ చేయాలి. దీంతో అదనపు అట్రాక్షన్ ఈ ప్రోమోకి దక్కింది. ఇందులో జడ్జ్ రాధ ఎంట్రీ సాంగ్ కి డాన్స్ చేసి మంచి ఓపెనింగ్ ఇచ్చింది. అయితే కంటెస్టెంట్స్ అందరు అలనాటి స్టార్ హీరోల ఆల్ టైం హిట్ సాంగ్స్ ని సెలక్ట్ చేసుకొని ప్రతి జంట తమ డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ప్రత్యేకించి అవినాష్- అరియానా జోడి కలిసి చేసిన 'ఆకు చాటు పిందె తడిసే' పాటకి సీనియర్ ఎన్టీఆర్ మార్క్ స్టెప్స్ తో అదరగొట్టారనే చెప్పాలి. వీరిద్దరి పర్ఫామెన్స్
చూసిన రాధ.. "దిస్ ఈజ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్" అంటూ చెప్పింది. ఆ తర్వాత "బంగిన పల్లి మామిడి పండు" సాంగ్ కి సూర్య-ఫైమా జోడి డ్యాన్స్ బాగా చేశారు. అది చూసిన సదా.. "సూర్య.. సూర్య.. ఏం చెప్పాలి" అంటూ ఎగ్జైట్ ఫీల్ అయింది. ఆ తర్వాత సదా స్టేజి మీదకి వచ్చి సూర్యతో కలిసి చిందులేసింది. బిబి జోడిలోని మగాళ్ళంతా లేడీ గెటప్స్ వేసుకుని అలరించారు.
అలనాటి సినిమాలలోని పాటలని, ఫైట్స్ ని రిక్రీయేట్ చేసిన ఈ డ్యాన్స్ ఎపిసోడ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. బిబి జోడి ప్రోమోనే ఈ లెవెల్ లో ఉంటే.. మరి ఫుల్ ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
